Thursday, November 8, 2012

పలుకరాదటే చిలుకా పలుక రాదటే ...... షావుకారు (1950)


పలుకరాదటే చిలుకా పలుక రాదటే
సముఖములో రాయబారమెందులకే
పలుకరాదటే....చిలుకా

ఎరుగని వారమటే....మొగమెరుగని వారమటే
పలికిన నేరమటే ....పలుకాడగ నేరవటే
ఇరుగుపొరుగు వారలకు
అరమరికలు తగునటనే పలుకరాదటే

మనసుని తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుపరాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా పలుకరాదటే

చిలుకా తెలుపవేలనే ....బదులు పలుకవేలనే

వలపు తలపులున్నా
కనుమాటు చాటు లేదా
పల్లెపడుచులీవగలు
కనీ వినీ ఎరుగరనీ చిలుకా తెలుపవేలనే

తళుకులూ బెళుకులూ
పల్లెటూర చూపిస్తే
పకా పకా నగుదురని
తెలుప వేలనే చిలుకా పలుకవేలనే

మనసులొకటి ఐతే ..మరి మాటతో పనేలా
కన్నెబాసలింతేనని ఎదుట నిలిచి పలుకరని
తెలుపవేలనే చిలుకా పలుకవేలనే.

తెలుసుకొంటినే చిలుకా
పలుకు వింటినే – నీ పలుకు వింటినే

చిత్రం : షావుకారు (1950)
సంగీతం : ఘంటసాల వెంకటేశ్వర రావు 
రచన : సీనియర్ సముద్రాల రాఘవాచార్య 
గానం : ఘంటసాల ,
**************************************
Movie Name : Shavukaru (1950)
Music Director : Ghantasala Venkateshwara Rao
Lyricist : Samudrala Raghavacharya (senior)
Singers : Ghantasala ,

No comments:

Post a Comment