Friday, November 9, 2012

ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేల నాతో ........ చక్రపాణి (1954)


ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేల నాతో
ఓ ప్రియురాల ఓ జవరాల
ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేలనే నాతో
ఓ ప్రియురాల ఆ ఆ ఆ ఆ ఆ ఆ

వెన్నెల సెలయేరున విరబూసిన
వెన్నెల సెలయేరున విరబూసిన కలువవు నీవేనే జవరాల
కలువవు నీవేనే జవరాల
నా మదిలో డోలలూగరావే ఓ ప్రియురాల

మిన్నుల పువుదోటల విహరించే
మిన్నుల పువుదోటల విహరించే కిన్నెర నీవేనే జవరాల
కిన్నెర నీవేనే జవరాల
నా మదిలో
నా మదిలో వీణ మీటరావే
నా మదిలో వీణ మీటరావే ఓ ప్రియురాల

పొన్నల నీడలలో నడయాడెడి
పొన్నల నీడలలో నడయాడెడి నెమలివి నీవేనే జవరాల
నెమలివి నీవేనే జవరాల
నా మదిలో
నా మదిలో నాట్యమాడరావే
నా మదిలో నాట్యమాడరావే
ఓ ప్రియురాల ఓ జవరాల పలుకవేల నాతో

చిత్రం : చక్రపాణి (1954)
సంగీతం : పి.భానుమతి
రచన : రావూరి రంగయ్య
గానం : ఏ.ఎం.రాజా
**********************************
Movie Name : Chakrapani
Music Director : P.Bhanumathi
Lyricist : Ravuri Rangaiah
Singer : A.M.Raja

No comments:

Post a Comment