Monday, November 5, 2012

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు ........ వెలుగు నీడలు (1961)



చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు చేరి మనం ఆడేపాడే పండుగరోజు
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట(2)

కళ్ళకి పట్టీ చల్లగా కట్టి వీపుతట్టి పోతాం
తాకినవారి పేరొకసారి చెప్పవోయి చూద్దాం
చురుకుతనం బుద్దిబలం ఉంటేనే చాలు
చూడకనే తెలియు కదా నిజానిజాలు

కన్నులుంది చూడలేరు కొంతమంది జనం
దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం
మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి

అంబా అనే అరుపు విని తల్లిని చేరు లేగ
నేల మెడ పిట్టను పోల్చు నింగినెగురు డేగ
చీకటైన చిటారుకొమ్మ చేరును కోతి
గురి తెలిసి మసలుకొనే నిదానమే నీతి...


చిత్రం : వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన : శ్రీశ్రీ
గానం : పి.సుశీల, స్వర్ణలత
*********************************************
chitti potti chinnari puttinaroju cheri manam adepade pandugaroju
vedukagaa ee puta aadudama dongata(2)

kallaki patti challaga katti veeputatti potam
takinavari perokasari cheppavoyi chuddam
churukutanam buddibalam vuntene chalu
chudakane teliyu kadaa nijaanijalu

kannulundi chudaleru kontamandi janam
dari tappi tiragadame telivilenitanam
medadu padunu pettali asalu donganu pattali

ambaa ane arupu vini tallini cheru lega
nela meda pittanu polchu ningineguru dega
cheekataina chitarukomma cherunu koti
guri telisi masalukone nidaname neeti...


Movie Name : Velugu Needalu (1961)
Music Director : Pendyala Nageshwara Rao
Lyricist : SriSri
Singers : P.Susheela, Swarnalatha

No comments:

Post a Comment