Monday, November 5, 2012

చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు ..... వెలుగు నీడలు (1961)


చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
పిడికిలి మూసిన చేతులు లేత గులాబి రేకులు
పిడికిలి మూసిన చేతులు లేత గులాబి రేకులు
చెంపకు చారెడు సోగ కన్నులె సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసి నవ్వులె మంచి ముత్యముల వానలు
చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసి నవ్వులె మంచి ముత్యముల వానలు

ఇంటను వెలసిన దైవము కంటను మెరిసిన దీపము
మా హృదయాలకు హాయినొసంగె పాపాయె మా ప్రాణము
ఇంటను వెలసిన దైవము కంటను మెరిసిన దీపము
మా హృదయాలకు హాయినొసంగె పాపాయె మా ప్రాణము
చల్లని వెన్నెల సోనలుతెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె మంచి ముత్యముల వానలు

నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా
నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా
పేరు ప్రతిష్ఠలె నీ పెన్నిదిగా నూరేళ్ళాయువు పొందుమా
మా పాపాయి నవ్వు పువ్వులె మంచి ముత్యముల వానలు
చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె మంచి ముత్యముల వానలు
చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు


చిత్రం : వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : శ్రీశ్రీ
గానం : జిక్కి , పి.సుశీల
******************************
Movie Name : Velugu Needalu (1961)
Music Director : Pendyala nageshwar rao
Lyricist : sri sri
Singers : Jikki , P.Susheela

No comments:

Post a Comment