Monday, November 5, 2012

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి ..... అగ్గిబరాటా (1966)


చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి (2)

నెలరాజు సైగచేసె వలరాజు తొంగిచూసె(2)
సిగపూలలోన నగుమొములోన
వగలేవొ చిందులేసె(2)

నయనాల తారనీవె
నా రాజహంస రావె(2)
ఆ..ఆ..ఆ..
నను చెరదీసి మనసార చూసి పెనవెసి నావు నీవె(2)

పవళించు మేనిలోన రవళించె రాగవీణ(2)
నీలాలనింగి లోలోనపొంగి కురిపించె పూలవాన(2)

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి !!


చిత్రం : అగ్గిబరాటా (1966)
సంగీతం : విజయా కృష్ణమూర్తి
రచన : C.నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, P.సుశీల
*****************************************************
Movie Name : Aggi Barata (1966)
Music Director : Vijaya Krishnamurty
Lyricist : C Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela

No comments:

Post a Comment