తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
వేడుకొన్న దయదలిచే వెంకటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
వెంకట రమణా.... వెంకటరమణా!
వేడుకొన్న దయదలిచే వెంకటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
నీ కన్నా మాకెవరూ లేనే లేరూ
నీ దీవెనలే మాకు చాలు వెంకట రమణా
వెంకట రమణా.... వెంకటరమణా!
తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
గాలిలోన దీపంలా ఉన్నామయ్యా -
నీ జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
వెంకట రమణా.... వెంకటరమణా!
గాలిలోన దీపంలా ఉన్నామయ్యా -
నీ జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
నీ పూజకొరకు పూచినా పువ్వులమయ్యా
నీ పాదాలే మాకు శరణు వెంకటరమణా
వెంకట రమణా వెంకట రమణా..!
తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ కరుణించే దైవము నీవే
తల్లివి నీవే తండ్రివి నీవే
చిత్రం : మూగ నోము (1969)
సంగీతం : ఆర్.గోవర్ధన్
రచన : ఆరుద్ర
గానం : పి.సుశీల & బృందం
******************************
Movie Name : Mooga Nomu (1969)
Music Director : R.Govardhan
Lyricist : Aarudra
Singers : P.Susheela & Chorus

No comments:
Post a Comment