Monday, November 26, 2012

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది ...... జీవిత చక్రం (1971)


పల్లవి :
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆశలు దాచకు.. ఆశలు దాచకు // కంటిచూపు //

చరణం 1 :
ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే - అండ కోరుకుంటాయి ఆ... హా..
అందమైన మగవాడు - పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు - ఓ పిల్లా
స్నేహము చేయవా - స్నేహము చేయవా // కంటిచూపు //

చరణం 2 :
కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంకా - రామచిలకా
ముద్దుపెట్టుకున్నాయి ఆ.. హా..
మెత్తనైన మనసు నీది - కొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది - ఓ పిల్లా
మైకము పెంచుకో - మైకము పెంచుకో // కంటిచూపు //

చరణం 3 :
చెప్పలేని వింత వింత అనుభవాలు - విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలూ
ఎదురుచూస్తున్నాయి ఆ.. హాహ్హ హ్హా..
నువ్వు నన్ను చేరాలి - నేను మనసు ఇవ్వాలి
ఎడము లేక ఉండాలి - ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా?  // కంటిచూపు //


చిత్రం : జీవిత చక్రం (1971)
సంగీతం : శంకర్-జైకిషన్
రచన : ఆరుద్ర
గానం : ఘంటసాల
*************************
Movie Name : Jeevitha Chakram (1971)
Music Director : Shankar jaikishan
Lyricist : Aarudra
Singer : Ghantasala

No comments:

Post a Comment