Sunday, November 4, 2012

ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...... జీవన జ్యోతి (1975)


ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్..
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు...
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు...
జుజుజుజుజు.. జుజుజుజుజు..

||ముద్దుల మా బాబు||

చల్లగా నిదరోయే బాబు.. నిదురలో మెల్లగ నవ్వుకునే బాబు.. ||2||
ఏమి కలలు కంటున్నాడొ తెలుసా... తెలుసా...
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ...
ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ...
జుజుజుజుజు.. జుజుజుజుజు...

||ముద్దుల మా బాబు||

దేవుడే నా ఎదురుగ నిలబడితే...ఏమి కావాలి తల్లీ..అని అడిగితే...||2||
నేనేమని అంటానో తెలుసా...తెలుసా...
నీ నీడలో నా వాడు పెరగాలనీ...
నీ నీడలో నా వాడు పెరగాలనీ...
పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని...జుజుజుజుజు.. జుజుజుజుజు...

||ముద్దుల మా బాబు||


చిత్రం : జీవన జ్యోతి (1975)
సంగీతం : K.V.మహదేవన్
రచన : దాశరథి
గానం : పి.సుశీల
************************************
Movie Name : Jeevana Jyothi (1975)
Music Director : K.V.Mahadevan
Lyricist : Dasarathi
Singer : P.Susheela

No comments:

Post a Comment