Saturday, November 3, 2012

వస్తావు కలలోకీ..రానంటావు కౌగిలికీ ...... గోపాలరావు గారి అమ్మాయి (1980)


వస్తావు కలలోకీ..రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ తీరేది ఎన్నటికీ

వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ
వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ
నువు కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ సగపాలు ఇద్దరికీ

పెదవి పైనా పెదవికి గుబులు.. పడుచుదనమే తీయటి దిగులు
కుర్రవాడికి తీరదు మోజు.. చిన్నదానికి బిడియం పోదు

హ .. చూపూ చూపూ కలిసిన చాలు
కొంగూ కొంగు కలిసిన మేలు
నన్ను దరిచేరనీ.. ముద్దుమాటాడనీ..
ముద్దు నెరవేరనీ.. ముందు జతకూడనీ..

వస్తావు కలలోకీ.. రానంటాను కౌగిలికీ

చిన్నదాన్ని నిన్నటి వరకూ.. కన్నెనైనది ఎవ్వరి కొరకూ
నాకు తెలుసూ నాకోసమనీ.. నీకె తెలియదు ఇది విరహమనీ

నేనూ నువ్వు మనమైపోయే వేళ
ఇంకా ఇంకా ఇంతటి దూరం ఏల
వలచి వలపించనా.. కరిగి కరిగించనా
నవ్వి నవ్వించనా.. గెలిచి గెలిపించనా

వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ

వస్తావు కలలోకీ..రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ తీరేది ఎన్నటికీ


చిత్రం : గోపాలరావు గారి అమ్మాయి (1980)
సంగీతం: చక్రవర్తి
రచన : వేటూరి
గానం: ఎం.రమేష్, పి.సుశీల

No comments:

Post a Comment