శంకరా నాద శరీరపరా
వేద విహారహర జీవేశ్వరా
శంకరా||
ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ రాగమె యోగమనీ
ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ రాగమె యోగమనీ
నాదో పాసన చేసినవాడను నీ వాడను నేనైతే
నాదో పాసన చేసినవాడను నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ లిన్నిద్ర గానమిది అవతరించరా విని తరించరా
శంకరా||
మెరిసె మెరుపులు మురిసె పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమె ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
మెరిసె మెరుపులు మురిసె పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమె ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా
తలకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా
తలకు జారెనా శివగంగా
నా గానలహరిన మునుగంగా
ఆనంద వృష్టినే తడవంగా
ఆ ….
చిత్రం : శంకరాభరణం (1980)
సంగీతం :కె.వి.మహదేవన్
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:
Post a Comment