Sunday, November 4, 2012

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ....... ప్రేమాభిషేకం (1981)

పల్లవి :
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా     (2)
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
 కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే
 నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా     (2)
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే
నూటొక్క టెంకాయ కొడతానని॥

చరణం : 1
హలో... ఆ: హలో...     (2)
హలో హలో అనమంటుంది కుర్రమనసు
చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు
పొమ్మని పైపైకి అంటుంది
రమ్మని లోలోన ఉంటుంది    ॥
పొమ్మని రమ్మంటే అది స్వర్గం
రమ్మని పొమ్మంటే అది నరకం
ఆ స్వర్గంలోనే తేలిపోవాలి
ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి
ఔనంటే నువ్వు ఊ... అంటే     (2)
నూటొక్క టెంకాయ కొడతానని॥

చరణం : 2
గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం
పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం
కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము
కళ్లు కుట్టుకుంటే గుణపాఠము
కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి
ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి
ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి
ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి॥॥


చిత్రం : ప్రేమాభిషేకం (1981)
సంగీతం : K.చక్రవర్తి
రచన : దాసరి నారాయణరావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల

No comments:

Post a Comment