Friday, November 9, 2012

మెరిసే తారలదేరూపం విరిసే పూవులదేరూపం ... సిరివెన్నెల (1986)


మెరిసే తారలదేరూపం విరిసే పూవులదేరూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఈ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన


చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment