Friday, November 2, 2012

పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దూ ....... ఆరో ప్రాణం (1997)


పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దూ
మనసుకి మనసే చేసే మూగ సైగ ముద్దూ

చలి దోపిడి ఈ ముద్దు..తొలి అలజడి ఈ ముద్దూ
ఎద సందడి ఈ ముద్దు..యమ సంబరమీ ముద్దు
మాట దాటొద్దూ..మారం చెయ్యొద్దూ
ఘాటు ముద్దిచ్చీ..నాలొ నిన్నే కలిపేద్దూ

పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దూ
మనసుకి మనసే చేసే మూగ సైగ ముద్దూ

మెడలో చేరే ఓ ముద్దూ..ముత్యాల ముద్దూ
వొడికే జారే ఆ ముద్దూ..వరహాల ముద్దూ
చెవినే తాకే ఓ ముద్దూ..సన్నాయి ముద్దూ
చేతికి అనెఏ ఓ ముద్దూ..చేసింది సద్దూ
పాపిట చెదిరే ఓ ముద్దూ..పడకింటి ఆ ముద్దు
నడుముని తడిమే ఓ ముద్దూ..తుడిచేసే సరిహద్దు

కాలి మువ్వల్లో..కానుక ఓ ముద్దూ
అన్నీ ముద్దుల్లో..పొద్దూ మాపు మునకేద్దూ

పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దూ
మనసుకి మనసే చేసే మూగ సైగ ముద్దూ

పొద్దున ఇచ్చే ఓ ముద్దూ..పొరపాటు ముద్దూ
చీకటి పడితే ఆ ముద్దూ..అలవాటు ముద్దూ
నిద్దుర చంపే ఓ ముద్దూ..నిజమైన ముద్దూ
వద్దని ఇచ్చే ఆ ముద్దూ..అసలైన ముద్దూ
చెక్కెర పంచే ఓ ముద్దూ..చెలికాడి తొలిముద్దూ
చుక్కలు చూపే ఓ ముద్దూ..మలి కొరే మలిముద్దూ

నన్ను ఆపొద్దూ..నిముషం నిలవొద్దూ
తేనె ముద్దిచ్చీ..తోడూ నీడై గడిపెయ్

పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దూ
మనసుకి మనసే చేసే మూగ సైగ ముద్దూ

చలి దోపిడి ఈ ముద్దు..తొలి అలజడి ఈ ముద్దూ
ఎద సందడి ఈ ముద్దు..యమ సంబరమీ ముద్దు
మాట దాటొద్దూ..మారం చెయ్యొద్దూ
ఘాటు ముద్దిచ్చీ..నాలొ నిన్నే కలిపేద్దూ


చిత్రం : ఆరో ప్రాణం (1997)
సంగీతం : కె.వీరు
రచన :
గానం : లావణ్య , మనో
******************************
Movie Name : Aaro Praanam (1997)
Music Director : K.Veeru
Lyricist :
Singers : Lavanya, Mano

No comments:

Post a Comment