పల్లవి
ఒలె ఒలె ఒలె ఓలా ఓలా
గిలి గిలి గిలిగా ఉంది ఈ వేళ - 2
నిలబడు నేనన్నది పైట నిదరన్నది లేదే పూట
ఏడ ఉన్నాడే ఏడ ఉన్నాడే ఏడ ఉన్నాడే కిలాడి ఏడ ఉన్నాడే
జాజులన్నాడే మోజులన్నాడే తోడు రమ్మంటే
కిలాడీ జారుకున్నాడే ||ఒలే||
చరణం 1
ఇంకా చెలియ ఏది ఏది చేసాడే
కలలో వచ్చి కౌగిలించు కున్నాడే
ఆ పై చిలకా ఏమి చేసి పోయాడే
చిరు నవ్వులు నవ్వాడే నడుముని తడిమేసాడే
కితకితలెడుతున్నాయన్నా వినుకోడే లవ్యు గిల్లేసాడే
ఏడ గిల్లాడే పిల్లా ఏడ గిల్లాడే
కొంటె కుర్రాడే లేత బుగ్గ గిల్లాడే ||ఒలె||
చరణం 2
గడయా వేస్తే తొంగి తొంగి చూసాడే
వారే పిల్లా అపప్పుడేమి చేసాడే
నేను వస్తా తలుపు తియ్య మన్నాడే
అమ్మో దొంగా చూసి ఏమిచేసాడే
పొగరెక్కిన పిల్లాడే పగబట్టి ఉన్నాడే, సరసానికి వద్దన్నా
సొద వినడే, లవ్లీ అంటూ పడిపోయాడే
ఏడ పడ్డాడే పిల్లా ఏడ పడ్డాడే
గోడమీదెక్కి కాలుజారి పడ్డాడే ||ఒలె||
చిత్రం : నువ్వే కావాలి (2000)
సంగీతం : కోటి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చిత్ర
*****************************
Movie Name : Nuvve Kavali(2000)
Music Director : Koti
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : Chithra

No comments:
Post a Comment