Friday, November 30, 2012

కళ్ళలో నువ్వే నువ్వే నా కలలో నువ్వే నువ్వే ......... చిరుజల్లు (2001)


కళ్ళలో నువ్వే నువ్వే
నా కలలో నువ్వే నువ్వే
మనసులో నువ్వే నువ్వే
ప్రతి మాటలో నువ్వే నువ్వే

ఎదుట పడిన ప్రతి వారిలో నిను చూసానా
నీవు తప్ప జనులెవరు లేరా ఈ లోకానా
తేల్చవా నువ్వే..

కళ్ళలో నువ్వే నువ్వే
నా కలలో నువ్వే నువ్వే

నిన్నంత నిదుర లేదు నీ వల్ల
అంత లేనిపోని నిందలా

హేయ్..నన్నింక వదలంటు పంతాల
లేనే లేనె చుట్టు పక్కలా

రేయంతా ఊహల్లో నీవు లేవా..నిజం ఒప్పుకో
చికట్లో ఏమి చూసావో..నన్నేనా గుర్తు చేసుకో

జ్యోతుల్లా మారిన చూపుల్లో
నీ రూపు సాక్ష్యం గా చూపనా
నీలాల నీ కంటి పాపల్లో
బంధించుకున్నావా నన్నిలా..చెలిమి సంకెలా

కళ్ళలో నువ్వే నువ్వే
నా కలలో నువ్వే నువ్వే
మనసులో నువ్వే నువ్వే
ప్రతి మాటలో నువ్వే నువ్వే

క్షేమంగా ఉంది కదా నా మనసూ
నాకు మాత్రం ఏమి తెలుసూ
నీకు కాక ఎవెరికెరుక దాని ఊసూ
కంట చూడలేదె అసలూ

ఏనాడో నా చేజారి వెళ్ళిందే నిన్ను చేరగా
ఏ గలిలో తేలుతుందో నా దాకా చేరలేదుగా

గుమ్మాన్ని దాటదు ఎప్పుడూ
ఏమైందో అంతేగా ఇప్పుడూ
ఆచూకి తెలిసినప్పుడూ
నీ కప్పగిస్తానే అమ్మడూ..నన్ను నమ్మవే

కళ్ళలో నువ్వే నువ్వే
నా కలలో నువ్వే నువ్వే
మనసులో నువ్వే నువ్వే
ప్రతి మాటలో నువ్వే నువ్వే

చిత్రం : చిరుజల్లు (2001)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఉదిత్ నారాయణ్ , కవితా కృష్ణమూర్తి

No comments:

Post a Comment