
నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే (2)
నువ్వే.. ఆశ నువ్వే.. శ్వాస నువు లేని ఈ నిముషం
యుగమైనా అవదుగా
నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే
నాలో ఉన్న నిన్ను మరిచేపోలేని నేను
తీరంలేని అలలా నిజమే కాలేని కలలా
నాలో లేని నేను కలవాలంటూనే నిన్ను
నీరే లేని నదిలా కన్నీరై ఉన్న మదిలా
వర్షం కోరి ఎండే చూసి మండే భూమిలా
ప్రేమే కోరి విరహం చూసి మిగిలా నేనిలా
వేరే దారి చూపే వేళ నిన్నే చేరుకోనా
నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే
నీ కౌగిళ్ళలోనే కాలం మాయమవనీ
నీ వేడి ఊపిరిలో ఇక నన్నే కరిగిపోనీ
నా ప్రతి అడుగులోనూ వెంటాడే జ్ఞాపకాలు
నువ్వే లేని నాడు చనిపోయే వరమే చాలు
వెళ్ళే దారి ముళ్ళే చల్లి నన్నే ఆపితే
నీళ్ళే మారి నిప్పై పొంగి నన్నే ముంచితే
గాలే జాలిచూపే వేళా పూవై చేరుకోనా
నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే
నువ్వే.. ఆశ నువ్వే.. శ్వాస నువు లేని ఈ నిముషం
యుగమైనా అవదుగా
నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్నీ నువ్వే
నా మౌనం నా గానం నా గుండెల సవ్వడి నువ్వే
చిత్రం : ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం : చక్రి
రచన : త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం : చక్రి
*****************************************
Movie Name : Oka Raju Oka Rani (2003)
Music Director : Chakri
Lyricist : Trivikram Srinivas
Singer : Chakri
No comments:
Post a Comment