Thursday, November 8, 2012

నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా... ఒకరికి ఒకరు (2003)














పల్లవి :
నాదిరిదీనా నాదిరిదీనానాదిరిదీనా...
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీనా నాదిరిదీనా....నాదిరిదీనా...
విచ్చిన పూల సందేశం విననా
నాదిరిదీనా నాదిరిదీనానాదిరిదీనా...
నచ్చినదాని కోసం నా తపన
సీతాకోకచిలుక రెక్కల్లోన ఒలికే
వర్ణాలన్ని చిలికి హోలీ ఆడనా

నాదిరిదీనా నాదిరిదీనానాదిరిదీనా...
నాదిరిదీనా నాదిరిదీనానాదిరిదీనా...
నాదిరిదీనా నాదిరిదీనానాదిరిదీనా...
నచ్చినదాని కోసం నా తపన

చరణం : 1
చిగురే పెదవై చినుకే మధువై
ప్రతిలతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై
ప్రతిదిశలో ప్రతిధ్వనియించే
ఎవరి కలో ఈ లలన
ఏ కవిదో ఈ రచన
॥

చరణం : 2
కురిసే జడిలో ముసిరే చలిలో
ప్రతి అణువు కవితలు పాడే
కలిసే శ్రుతిలో నిలిచే స్మృతిలో
ప్రతిక్షణము శాశ్వతమాయే
ఈ వెలుగే నీ వలన
నీ చెలిమే నిజమననా...
॥

చిత్రం : ఒకరికి ఒకరు (2003)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కార్తీక్, గంగ
******************************
Movie Name : Okariki okaru (2004)
Music Director : M.M.keeravani
Lyricist : Chandrabose
Singers  : Karthik ,Ganga

No comments:

Post a Comment