ఊహల్లోనా ఒదిగిన ఆశే నీవై ..
అలజడి పుట్టిస్తావు ప్రియ మదనా
హృదయం లోనా కరగని ధ్యాసే నీవై ..
తపనలు పెంచేస్తావు ఇది తగునా
శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావూ ..
అంతేలేని వరాలనందిస్తావూ
మాయో హాయో నీకిది తగునా .. నేనే నీవైపోతున్నా
నీలో సాగే శ్వాసల సెగతో .. హే హే హే
ప్రతిక్షణం అలై జ్వలించే సోయగం
తపించదా ఇలా వరిస్తే సాహసం
ప్రతిక్షణం అలై జ్వలించే సోయగం
తపించదా ఇలా వరిస్తే సాహసం
పొంగే నదినై .. సుదూరాలే దాటుతున్నా
సాగే సుధనై .. సరాగాలే పాడుతూ
వెంటాడే నీడై నను ఇలా .. వేధిస్తావేలా రసికరా .. మదనా !
ఊహల్లోనా ఒదిగిన ఆశే నీవై .. అలజడి పుట్టిస్తావూ ప్రియ మదనా
ప్రియా మధూకరా .. మధించే ఆశలా
సఖీ సమీరమై కురిస్తే ఏలరా
ప్రియా మధూకరా .. మధించే ఆశలా
సఖీ సమీరమై కురిస్తే ఏలరా
మూస్తే కళ్ళే .. మరోలోకం చేరుతున్నా
వీచే గాలై .. అలా పైకి తేలగా
నా ధ్యానం నీవై దాహమాయె .. ఏదేదో చేస్తావేంటలా .. వరమా !
ఊహల్లోనా ఒదిగిన ఆశే నీవై .. అలజడి పుట్టిస్తావు ప్రియ మదనా
హృదయం లోనా కరగని ధ్యాసే నీవై .. తపనలు పెంచేస్తావు ఇది తగునా
శ్వాసల్లోనా స్వరాలు మ్రోగిస్తావూ .. అంతేలేని వరాలనందిస్తావూ
మాయో హాయో నీకిది తగునా .. నేనే నీవైపోతున్నా
నీలో సాగే శ్వాసల సెగతో .. హే హే హే
చిత్రం : మంత్ర (2007)
సంగీతం: ఆనంద్
రచన : ఆనంద్
గానం : సుచిత్ర

No comments:
Post a Comment