పల్లవి :
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ ||2||
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరికో
తేల్చుకో ముందుగా ఛలోరే – - -
చంపనిదే బతకవని బతికేందుకు చంపమని నమ్మించే
అడివిని అడిగేం లాభం బతికే దారెటని ఛలోరే …
సంహరం సహజమని సహవాసం స్వప్నమని తర్కించే
తెలివికి తెలిసేనా తానే తన శత్రువని చలోరే …
ధీరులకి, దీనులకి అమ్మ ఒడి ఒక్కటే వీరులకి, చోరులకి కంట
తడి ఒక్కటే చలోరే …
అప్పుడెపుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం యుగ
యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం చలోరే …
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం చలోరే …
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవి కిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం చలోరే …
చిత్రం : జల్సా (2008)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల
గానం : రంజిత్ (తెలుగు)

No comments:
Post a Comment