Thursday, November 1, 2012

తీసే ప్రతి శ్వాసా .. తన తలపౌతున్నదీ ..... విలేజ్ లో వినాయకుడు (2009)



తీసే ప్రతి శ్వాసా .. తన తలపౌతున్నదీ
తీసే ప్రతి శ్వాసా తన తలపౌతున్నదీ
జారే ప్రతి ఆశా జత అడుగేదన్నదీ

ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నదీ
ఓ నీడ తన వెలుగునే వెతుకుతున్నదీ

కలవో లేవో కనలేని ప్రేమా !

కను చూపు ఎటు వాలుతున్నా .. తన రూపు కదలాడుతోందా
ప్రతి గాలి తన లాలి పాటైనదా
కన్నీటి అల తాకుతుంటే .. ఈ కంటి కల కరుగుతోందా
ప్రతి మలుపు తను లేని బాటైనదా

హే ఆ పాశమే నేడు .. ఆవేదనౌతోందా
ఏ దారి కనరాక ఎదురీదుతూ ఉందా
ఈ పాదమీ వేళా ఏకాకి లా మల్లే
ఏ దరికి చేరాలో ఎదనడుగుతుందా

తొలి ప్రేమ గుండెలను తొలిచేస్తు ఉన్నదా
తొలి ప్రేమ గుండెలను తొలిచేస్తు ఉన్నదా

కలవో లేవో కనలేని ప్రేమా


చిత్రం : విలేజ్  లో వినాయకుడు (2009)
స౦గీత౦ : మణికా౦త్ కాద్రి
రచన: వనమాలి
గానం : హరిహరన్

No comments:

Post a Comment