Saturday, November 3, 2012

తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి ....... కావ్యాస్ డైరీ (2009)


తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి
తెలుసుకో నన్నే నీ గుండెనే తెరిచి
తెలపాలి నువ్వైనా
తెలపాలి నువ్వైనా నేనే తెలుపలేకున్నా
తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి

నీ చేరువై నేనుండగా ఈ దూరమేమిటో ఇంతగా
అనుకొనే నా మనసునే వినవా
నీ స్వాశ సోకితె చాలని ఆ ఆశ ఇంకిపోలేదని
నిజమునే నీ పెదవితో అనవా ..హో
తలచుకుంటాను నువ్వు నేనే తలచేవని ఈ క్షణం
నిదురలేస్తాను ఎదురుగా కదలేవని ఈ దినం .....

నేనే తెలుపలేకున్నా

అపుడేమొ పెదవి పై నవ్వులే ఇపుడేమో నవ్వులొ నలుపులే
ఎందుకా చిరునవ్వులో మసకా
అపుడెంత కసిరినా మాములే ఇపుడేమి జరిగినా మౌనమే
ఎందుకే నీ మాటలో విసుగా
కలిసి రావాలి వెంటనే కాలాలు మనకోసమే
దరికి చేరాలి అంతలో భారాలు మమకారమై
నేనే తెలుపలేకున్నా

నీతో నేనే తెలుపలేకున్నా


చిత్రం : కావ్యాస్ డైరీ (2009)
సంగీతం : మను రమేషన్
రచన  : అనంత్ శ్రీరామ్
గానం : కార్తీక్ , రీటా

No comments:

Post a Comment