Thursday, November 1, 2012

నీలి మేఘమా అ౦తవేగమా .. విలేజ్ లో వినాయకుడు (2009)

నీలి మేఘమా అ౦తవేగమా ..

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా (2)
తూనీగా రెక్కలే పల్లకీగా .. ఊరేగే ఊహలే ఆపడం నా తరమా

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా

ప్రతీ మలుపులోనూ తనే కొలువయిందీ
ఒకో జ్ఞాపకన్నీ నాకే పంచుతోందీ
ఆ ఏటి గట్టూ అల పాదాలతోటీ ..
ఈ గుండె గదిని తడి గురుతు చూపుతుందీ
ఆ నదులూ .. విరిసే పొదలూ .. నా ఎదకూ ఆమెనే చూపినవి

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా

మదే కనని పాశం ఇలా ఎదురయిందా
తనే లోకమన్నా ప్రేమే నవ్వుకుందా
ఈ ఇంటిలోని అనుబంధాలు చూసీ .. నా కంటిపాపే కరిగింది ముచ్చటేసి

ఈ జతలో .. ఒకడై ఒదిగే .. ఓ వరమే చాలదా ఎన్నటికీ

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా

చిత్రం : విలేజ్  లో వినాయకుడు (2009)
స౦గీత౦ : మణికా౦త్ కాద్రి
రచన: వనమాలి
గానం : కార్తీక్

No comments:

Post a Comment