Thursday, November 1, 2012

మనసే అటో ఇటో .. ఎగిరే ఎటో ఎటో ....... తకిట తకిట (2010)


మనసే అటో ఇటో .. ఎగిరే ఎటో ఎటో
తెలుసా ఇదేమిటో .. ఈ ఎదలో కధేమిటో
తొలి తొలి ప్రేమలోన పడి ముకలేసినది కనుకే ఇంతలా
వెనకకి రాను రాను అని నా మదీ వెతుకుతోందే నిన్నిలా .. నేరుగా ! (2)

ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నీవల్లేగా ..
నువు లేకుండా తోచదు నాకే
చుట్టూరా ఎందరు ఉన్నా నీ చుట్టూనే తిరిగేస్తుందే .. ప్రాణం
సరికొత్తగ హరివిల్లేదో అరచేతులకే అందెను చూడూ నమ్మవు గానీ .. ఇది నీవల్లే
ఒట్టేసి చెప్పాలంటే నాలో ఉందీ నేనే కాను .. అంతటా నీ ఊహలే

చెలియా .. చెలియా .. నిజమా .. కలయా
నువు నాకోసం నేన్నీకోసం బహు చిత్రం గా మనబంధం కలిసెను
తరగని సిరులుగ చెరగని గురుతువి నువ్వే !!

నా గుండెల సవ్వడి వింటే నీ పేరే మరి వినిపిస్తుంది గమనించాలే .. గారడి నీదే
ఇకనుంచీ నువ్వూ నేనూ మనమే కాదా ఒకరికి ఒకరం .. తోడూ
కన్నుల్లో కొలువై ఉన్నా కలలో కూడా నీ చిరునవ్వే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే !
మనసిస్తే కాదనవంటూ నమ్మకమేదో నడిపించిందీ నన్నిలా నీ వైపుగా

వలపే వరదై .. నడకే పరుగై
నీ చూపుల్లో నీ మాటల్లో నీ మైకం లో మైమరపే కలిగెను
ఎవరిని చూసిన అది నువ్వనుకుంటానే !!

మనసే అటో ఇటో .. ఎగిరే ఎటో ఎటో
తెలుసా ఇదేమిటో .. ఈ ఎదలో కధేమిటో !!!

చిత్రం : తకిట తకిట (2010)

సంగీతం: బోబో శశి
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం: కార్తీక్, చిన్మయి

No comments:

Post a Comment