Tuesday, November 20, 2012

శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడనీ.... ఊసరవెల్లి (2011)















నీకు వంద మంది కనపడుతున్నారేమో ..
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధమంటూ మొదలు పెట్టాకా ..
కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే

శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం..

ఓ భజరంగభళి దుడుకున్నదిగా నీ అడుగులలో..
నీ సరిలేరని దూకరా ఆశయ సాధనలో
ఓ పవమానసుత పెను సాహసముందిగా పిడికిలిలో
ఏ పని చెప్పరా దానికి విషమ పరీక్షలలో

స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము
ధరణి దైన్యమును తీర్చగ రా
నివురు నొదిలి శివ ఫాల నేత్రమై
దనుజ దహనమునకై దూసుకురా..
స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము
ధరణి దైన్యమును తీర్చగ రా
నివురు నొదిలి శివ ఫాల నేత్రమై
దనుజ దహనమునకై దూసుకురా..

శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం 
దండించాలిరా దండకారివై దుండకాల దౌష్ట్యం 
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం 
పూరించాలిరా నీ శ్వాసతో ఓంకార శంఖం 

ఆ బ్రహ్మాస్త్రము సైతం వమ్మవదా నీ సన్నిధిలో..
ఆ యమపాశమే పూదండవదా నీ మెడలో..
నీవు నమ్మిన తారక మంత్రం ఉన్నదీ హృదయంలో..
అదే రహదారిగా మార్చదా కడలిని పయనములో

శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
ఓం.. భజే వాయుపుత్రం.. భజే వాల గాత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం..

చిత్రం : ఊసరవెల్లి (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎం.ఎల్.ఆర్.కార్తికేయన్
***********************************
Neeku Vanda Mandi Kanapadutunnaremo..
naku Maathram Okkade  Kanapaduthunnadu
yuddam antu modalu pettaka
kantiki kanapadaalsindi target maathrame

Sri Anjaneyam bhaje vajrakayam
sadha rakshaga kapadani nee namadheyam
Sri Anjaneyam bhaje vayuputram
sadha abhayamai andinchara nee chethi saayam

Ooo bhajarangabali dhudukunnadiga nee adugulalo
nee sarilerani dookara aashaya saadhanalo
Ooo pabhamanasutha penu sahasamundiga pidikililo
ye pani cheppara daaniki vishama parikshalalo

Spurana thechchukuni swiya prathapamu
dharani dhainyamunu theerchaga raa
nivurunodili siva phaala nethramai
dhanuja dhahanumunakai doosukura
Spurana thechchukuni swiya prathapamu
dharani dhainyamunu theerchaga raa
nivurunodili siva phaala nethramai
dhanuja dhahanumunakai doosukura

Sri Anjaneyam bhaje vajrakayam
dandinchalira dandakaarivai dhundakala dhoushtyam
Sri Anjaneyam bhaje vayuputram
poorinchali ra nee shwaasatho omkara shankam

Aaaa brahmastramu saitham vammavadha nee sannidhilo..
aaa yamapasame poodhandavadha nee medalo..
neevu nammina taaraka mantramu unnadhi hrudayamulo
adhey rahadaariga maarchada kadalini payanamulo

Sri Anjaneyam bhaje vajrakayam
sada rakshaga kapadani nee namadheyam
Om..bhaje vayuputram bhaje vaalagathram
sadha abhayamai andinchara nee chethi saayam

Movie Name : Oosaravelli (2011)
Music Director : Devisri Prasad
Lyricist : Sirivennela Sitarama Sastry
Singer : M.L.R. Karthikeyan

No comments:

Post a Comment