Thursday, November 1, 2012

తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా ....... LBW (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) (2011)


తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా

కన్నులు రమ్మంటే కలలే రానే రావు కదా
ఏదేమైనా నీతో నువ్వే ఉండాలికా

నా పంతం నాదంటూ ఊరుకోవు కదా
కలతన్నది కన్నీరా .. తరిగే వీలుందారా
ఎడబాటే లేదంటే .. ప్రేమ కాదు కదా !

నాకొద్దు పొమ్మంటే పారిపోదు కదా
వలపన్నది తలపేనా .. తెలిసే రేపుందారా
నాకోసం రమ్మంటే .. ప్రేమ రాదు కదా !

ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా !
తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఆనందం వద్దంటూ నే మాత్రం అంటానా
ఏకాంతం వద్దంటూ నీ మౌనం అంటున్నా

ఈ వాలినా పొద్దులో చీకటే .. ఆ వేకువై ఉదయమే వెలగదా !


చిత్రం : LBW (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) (2011)
సంగీతం : అనిల్.R


రచన : కృష్ణ చిన్ని
గానం : జావేద్ ఆలి, రమ్య

No comments:

Post a Comment