
హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా
హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా
మధువులు చిలికించె మైకం పొంగుతుంది నీలో
మైకం తట్టుకొనే మగసిరి పొగరుంది నాలో
మధువులు చిలికించె మైకం పొంగుతుంది నీలో
మైకం తట్టుకొనే మగసిరి పొగరుంది నాలో
కైపులు పెంచుకొంద్దాం లేలేలే
సుఖములు పంచుకొందాం రారారా
అందాలు నీవీఅనుభవం నాదీ
ఆనందం ఇదే..ఇదే..
హాయిగా మత్తుగాఆడవే అందాల భామా....భామా
కొత్తగ మురిపించు పాతను మరపించు ముద్దుగా
ఘుమఘుమలాడించుకోరిక పండించు మెత్తగా
కొత్తగ మురిపించు పాతను మరపించు ముద్దుగా
ఘుమఘుమలాడించు కోరిక పండించు మెత్తగా
రేపు నీవెక్కడో ఏమోలే రేపు నేనెవ్వరో ఏమోలే
ఈ రోజు మోజూ ఈ రేయి హాయీ ఇద్దరికీ చాలూ..చాలూ..
హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా
ఆడాక చూపించు కాసింత ప్రేమా
హాయిగా మత్తుగాఆడవే అందాల భామాభామా
చిత్రం : ఇల్లు ఇల్లాలు (1972)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆరుద్ర
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
****************************
Movie Name : Illu Illalu (1972)
Music Director : K.V.Mahadevan
Lyricist : Aarudra
Singer : S.P.Bala Subramanyam
No comments:
Post a Comment