Monday, December 17, 2012

నీ పైన నాకెంతో అనురాగముందని ....... అభిమానవతి (1975)


నీ పైన నాకెంతో అనురాగముందని
నీ పైన నాకెంతో అనురాగముందని
నిను వీడి క్షణమైనా నేనుండ లేనని
ఎలా, ఎలా నీకెలా తెలిపేది ( 2) !! నీ పైన!!

నీలి నింగిలో కోటి తారలు మాలలల్లి తేనా
అందమైన ఆ చందమామ నీ కురుల తురుమవలెనా (2)
అణువణువున నీవే వ్యాపించినావని (2)
ఎలా, ఎలా నీకెలా తెలిపేది (2) !! నీ పైన!!

వలపు తెలియని మనసులోనికి ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకుని మమత పంచుకొని మరలి వెళ్లి పోతున్నావు
నిన్నే హృదయాన నిలిపాను నేనని
ఎలా, ఎలా నీకెలా తెలిపేది (2 ) !! నీ పైన!!


చిత్రం : అభిమానవతి (1975)
సంగీతం : చక్రవర్తి
రచన : దాశరథి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
**********************************
Movie Name : Abhimanavathi (1975)
Music Director : Chakravarthy
Lyricist : Dasarathi
Singer : S.P.Bala Subramanyam

No comments:

Post a Comment