చీకటి వెలుగుల కౌగిటిలో .. చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో .. చిందే కుంకుమ వన్నెలూ
ఏకమైనా హృదయాలలో .. ఏకమైనా హృదయాలలో ..
పాకే బంగరు రంగులూ ..
ఈ మెడ చుట్టూ గులాబీలూ .. ఈ సిగపాయల మందారాలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ .. ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ .. చిక్కని ఈ అరుణ రాగాలు
అందీ అందని సత్యాలా .. సుందర మధుర స్వప్నాలా !
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా .. నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా .. నాటిన పువ్వుల తోటా
నిండు కడవలా నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ
ప్రతి తీగకు చేయూత నిచ్చీ
ప్రతి మానూ పులకింపజేసీ
మనమే పెంచిందీ తోటా....మరి ఎన్నడు వాడనిదీ తోటా
మనమే పెంచిందీ తోటా .. మరి ఎన్నడు వాడనిదీ తోటా
మరచిపోకుమా తోటమాలీ .. పొరపడి అయినా మతిమాలీ
మరచిపోకుమా తోటమాలీ .. పొరపడి అయినా మతిమాలీ
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో
మల్లెలతో వసంతం....చేమంతులతో హేమంతం
వెన్నల పారిజాతాలూ.....వానకారు సంపెంగలూ
అన్నీ మనకు చుట్టాలే....వచ్చీ పోయే అతిధులే
ఈ మెడ చుట్టూ గులాబీలూ .. ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ .. చిక్కని ఈ అరుణ రాగాలూ
ష్ ..
గలగలమనకూడదూ .. ఆకులలో గాలీ
గలగలమనరాదూ .. అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ ..
నిదరోయే కొలను నీరూ .. కదపకూడదూ
ఒరిగుండే పూలతీగా .. ఊపరాదూ
కొమ్మపై నిట జంటపూలూ....గూటిలో ఇట రెండు గువ్వలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ .. ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ .. చిక్కని ఈ అరుణ రాగాలూ
మరచిపోకుమా తోటమాలీ .. పొరపడి అయినా మతిమాలీ !
చిత్రం : చీకటి వెలుగులు (1975)
సంగీతం : చక్రవర్తిసాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
**********************************
Movie Name : Cheekati Velugulu (1975)
Music Director : Chakravarthy
Lyricist : Devulapalli Krishna Sastry
Singers : S.P.Bala Subramanyam , P.Susheela

No comments:
Post a Comment