Wednesday, December 26, 2012

లిపిలేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ ...... శ్రీవారికి ప్రేమలేఖ (1984)



లిపిలేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ నీ లేఖని నీ ప్రణయ రేఖనీ
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమ లేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా
రాయనీ నా లేఖని ప్రణయ రేఖని

అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతూ వుంది వేదన తానై
విధియ నాటి జాబిలి కోసం
వెలుగు నీడలేన్నున్నా వెలగలేని ఆకాశం
లలలల......ఆ......తనన.....
ఎదుగుతూ వుంది వెన్నెల తానై
ఒక్కనాటి పున్నమి కోసం (లిపి లేని)

అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకొని
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
ఘడియైన నీవు లేక గడపలేక వున్నాను


చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
**************************************
lipileni kanti basa telipindi chilipi asha
ne kannula katuka lekhalalo
ne sogasula kavithaa rekhalalo
ila ila chadavanee ne lekhani ne pranaya rekhanii
badulaina leni lekha bratukaina prema lekha
ne kougita bigisina shwasalato
ne kavitalu nerpina prasalato ila ila
rayanii na lekhani pranaya rekhani

amavasya nishilo koti taralunna akasham
vedukutu vundi vedana tanai
vidhiya nati jabili kosam
velugu nedalennunnaa velagaleni akasham
lalalala......aaa......tanana.....
yedugutu vundi vennela taanai
okkanati punnami kosam (lipi leni)

aksharala needalalo ne jadalu chusukoni
aa padala allikalo ne pedavulu addukuni
ne kantiki papanu nenai
ne intiki vakili nenai
gadapa dataleka nanne gadiya vesukunnanu
ghadiyaina nevu leka gadapaleka vunnanu


Movie Name : Srivariki Premalekha (1984)
Music Director : Ramesh Naidu
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : S.P.Bala Subramanyam , S.Janaki

No comments:

Post a Comment