Friday, December 7, 2012

నా ప్రేమకే శెలవు నా దారికే శెలవు ........... నీరాజనం (1988)














నా ప్రేమకే శెలవు నా దారికే శెలవు
కాలానికే శెలవు దైవానికే శెలవు
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శెలవు
నా ప్రేమకే శెలవు నా దారికే శెలవు
కాలానికే శెలవు దైవానికే శెలవు

చరణం 1:
మదిలోని రూపం మొదలంత చెరిపీ మనసార ఏడ్చానులే..
కనరాని గాయం కసితీర కుదిపీ కడుపార నవ్వానులే
నా ప్రేమకే శెలవు నా దారికే శెలవు
కాలానికే శెలవు దైవానికే శెలవు

చరణం 2:
అనుకున్న దీవీ అది ఎండమావి..
ఆ నీరు జలతారులే....
నా నీడ తానే నను వీడగానే మిగిలింది కన్నీరులే..
నా ప్రేమకే శెలవూ.... నా దారికే శెలవూ


చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ. పి.నయ్యర్
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
******************************
Movie Name : Neerajanam (1988)
Music Director : O.P.Nayyer
Lyricist : C.Narayana Reddy
Singers : S.P Bala subramaniam

No comments:

Post a Comment