Friday, December 28, 2012

ధీం ధినక్‌తరి న క్తిక్తోం...ధీం ధినక్‌తరి న క్తిక్తోం....... సంతోషం (2002)


పల్లవి :
ధీం ధినక్‌తరి న క్తిక్తోం...ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం...ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం

చరణం : 1
అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ల కూతలకీ
హద్దంటూ లేదయ్యో ఈ దినం
సందట్లో సందయ్యో పెళ్లవనీ జంటలకీ
ఆనందం అందించే ఈ క్షణం
పేకాట రాయళ్ల చేజోరు చూడాలి
ఈ పెళ్లి లోగిళ్లలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు
కుర్రాళ్లు విడిదింటిలో
కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు
కొంటెసైగలే ఇష్టమంట
ధీం ధినక్‌తరి న క్తిక్తోం...ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం

చరణం : 2
ఈ పెళ్లిపందిరిలో సరదాల సందడిలో
ఈ నేలకొచ్చిందయ్యో అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా
ఈ ఇంట జరగాలయ్యో సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు
చేరేది ఈ వేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి
ఈ వేదమంత్రాలలో
కన్యాదాతకి అప్పగింతలూ
కంటితుడుపులూ తప్పవంట
ధీం ధినక్‌తరి న క్తిక్తోం...ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం


చిత్రం : సంతోషం (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : శంకర్ మహదేవన్
********************************
dhin dhinak tare naktik tom dhin dhinak tare naktik tom
dhin dhinak tare naktik naktik tom
guppedanta gundello cheppaleni aanandam
ee kshanaale ento santosham

Movie Name : Santhosham (2002)
Music Director : R.P.Patnayak
Lyricist : Kulasekhar
Singer : Shankar Mahadevan

No comments:

Post a Comment