
పల్లవి :
సత్తే ...యహసత్తే...అరెసత్తే యహసత్తే ఓసత్తి అహసత్తే...
ఏ సత్తే ఏగొడవలేదు సత్తే ఏగోలలేదు పుట్టే ప్రతివోడు సత్తాడోయ్
ఏ కలకాలం కాకుల్లాగ గడిపేస్తె ఏమొస్తుంది హంసల్లె దర్జాగుండాలోయ్
ఏయ్ అందమైన ఈ జీవితానికో అర్థం వెతకాలోయ్
కోటి మందిలొ పోటుగాడిలో నువ్వే బతకాలోయ్ ||సత్తే||
చరణం : 1
చెయ్యాలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు
అరె చేసినతప్పే మళ్ళీ నువు చేస్తే తప్పు
ఏ తప్పు చెయ్యకపొతే అది ఇంకా తప్పు
మరి అంతానికే తెలుసనికోవటం పొరపాటవదా
నువు సేసే పనిలో ప్రాణం పెట్టి దూకై గురువా
ఊపుండాలి ఉత్సాహం గుండెల్లో నీదమ్మెంతో చూపించై అందర్లో
గురువై ఆ మెరుపై పిడుగై నువ్వడుగై ||సత్తే||
చరణం : 2
అరె అందమైనదీ లోకం అది చూడకుంటె నీలోపం
ఈ పగలు రేయి లేకుంటె రోజే అవదు
ఏకష్టం నష్టం రాకుంటె లైఫే అనరు
మరి అందరిలాగె నువ్వు ఉంటె రాదేసరదా
పదిమంది నడిచే దార్లో వెలితె బోరే అవద
పనిలేదంటే కొట్టేసె అస్కైనా పనికొస్తుందా చేసేసై రిస్కైనా
గెలుపే నీ పిలుపై దొరలా నువు బతికై బతికై ||సత్తే||
చిత్రం : దేశముదురు (2007)
సంగీతం : చక్రి
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : రంజిత్
No comments:
Post a Comment