పల్లవి :
గుండెల్లో... ఊఁ... కళ్ళల్లో... ఊఁ...
గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి
కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోంది సందడి
నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని
తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడి
తుళ్లి తుళ్లి పోతోంది ప్రాయం తెలుసా తడబడి
గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి
కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోంది సందడి
చరణం : 1
నా పెదవంచులో నీ పిలుపున్నది
నీ అరచేతిలో నా బతుకున్నది
ఇన్నాళ్ళెంత పిచ్చోణ్ణి నేను మనసిస్తుంటే తప్పించుకున్నా
మొత్తం మీద విసిగించి నిన్ను ఏదోలాగ దక్కించుకున్నా
మనసున్నది ఇచ్చేందుకే కనులున్నాయి కలిపేందుకే
అని తెలిశాక నీ ప్రేమలో పడిపోయానులే
గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి
కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోంది సందడి
చరణం : 2
నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ
ఈ గిలిగింతలో నే పులకించనీ
నాకో తోడు కావాలి అంటూ ఎపుడూ ఎందుకనిపించలేదు
వద్దొద్దంటూ నే మొత్తుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో
కన్నీళ్ళొస్తే తుడిచేందుకూ సంతోషాన్ని పంచేందుకూ
ఎవరూ లేని జన్మెందుకూ అనిపించిందిలే
గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి
కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోంది సందడి
నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని
తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడి
తుళ్లి తుళ్లి పోతోంది ప్రాయం తెలుసా తడబడి
గుండెల్లో... ఊఁ... కళ్ళల్లో... ఆహహా
చిత్రం : గోలీమార్ (2010)
సంగీతం : చక్రి
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : చక్రి, కౌసల్య
*******************************
Movie Name : Golimaar (2010)
Music Director : Chakri
Lyricist : Bhaskrabhatla Ravikumar
Singers : Chakri , kousalya
No comments:
Post a Comment