Friday, December 14, 2012

నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక ..... ఊసరవెల్లి (2011)














పల్లవి :
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారికా నిహారికా నువ్వే నేనిక
నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరిక 
నిహారికా నిహారికా నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక 
నిహారికా నిహారికా నువ్వే నేనిక 

నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను ...నిన్నే ఇష్టపడ్డానంటానంతే
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను ...నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక ...నిహారికా నిహారికా నువ్వే నేనిక 

చరణం : 1
రెండు రెప్పలు మూతపడవుగా నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూరమైతే
రెండు చేతులు ఉరుకోవుగా నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగ నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నాచెంతకొచ్చినావో నిన్నింక వదులుకోను చెయ్యందుకో..
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక 
నిహారికా నిహారికా నువ్వే నేనిక 

చరణం : 2
నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పు లాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తియ్య తియ్యగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉంది
జీవితానికివ్వాళే చివరి రోజు అన్నట్టు మాటలాడుతున్నావుగా
ఎన్ని మాటలవుతున్నా కొత్త మాటలింకెన్నో గుర్తుకొచ్చెనే వింతగా..
ఓ నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక ...నిహారికా నిహారికా నువ్వే నేనిక 
నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరిక ..నిహారికా నిహారికా నువ్వయ్యానిక 

చిత్రం : ఊసరవెల్లి (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : అనంత శ్రీరామ్
గానం : విజయ్ ప్రకాష్ , నేహ భాసిన్ 
***********************************
Oh niharika niharika nuvve naa darika naa darika
niharika niharikanuvve nenika
Oh niharika niharika nuvve naakorika naakorika
niharika niharika nuvvayyanika
Hmmm.. nuvve nuvve kavali nuvve nuvve kavali antundi naapraname
nuvve nuvve ravali nuvve nuvve ravali antunde naahrudayame
Oh niharika niharika nuvve naa darika naa darika
niharika niharikanuvve nenika

Neepay ishtamenthundo ante cheppalenu...ninne ishtapaddaanantaa nanthe
nakay inni cheyyalani ninnem korukonu...naatho eppudu untanante chalanthe
Oh niharika niharika nuvve naa darika naa darika
niharika niharikanuvve nenika

Rendu reppalu muthapadavuga nuvvu daggarunte
rendu pedavulu theruchukovuga nuvvu doooramaithe
rendu chethulu urukovuga nuvvu pakkanunte
rendu adugulu veyyalenuga nuvvu andanante
iddarokkatayyaka okkachota unnaka rendu anna matenduko
okkasari naachenthakochinavu ninninka vadulukonu cheyyandukoooo
Oh niharika niharika nuvve naa darika naa darika
niharika niharikanuvve nenika

Nuvvu enthaga thappu chesina oppulage undi
nuvvu enthaga haddu datina muddugane undi
nuvvu enthaga thittiposina thiyya thiyyagundi
nuvvu enthaga bettu chupina haaigane udni
jeevithanikivvale chivariroju annattu mataladukunnamuga
enni maatalavuthunna kotha matalenno gurthukoche vinthaga
Oh niharika niharika nuvve naa darika naa darika
niharika niharikanuvve nenika
Oh niharika niharika nuvve naakorika naakorika
niharika niharika nuvvayyanika

Movie Name : Oosaravelli (2011)
Music Director : Devisri Prasad
Lyricist : Anantha Sriram
Singers : Vijay Prakash , Neha Bhasin

No comments:

Post a Comment