
ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకూ...
మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్నుపాలు కానీకూ...
కష్టమనేది లేని రోజంటు లేదు కదా...
కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా హో....
అమ్మ కడుపు వదిలిన అడుగడుగూ హో....
ఆనందం కోసమే ఈ పరుగూ హో....
కష్టాల బాటలో కడ వరకూ హో.... చిరునవ్వు వదలకు
హో....... హో.... ఓ హో....... ఓ.....
నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు
నువు నేను చేసినవా మన పేరున జరిగే పనులు
ఇది మంచియని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు
అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు
అవుతున్న మేలు కీడూ... అనుభవాలేగా రెండూ....
దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వెయ్యకుంటే కాల యాత్ర కదిలేనా వావ్..వావ్..వావ్..
నడి సంద్రమందు నిలిచాకా ....వావ్..వావ్..వావ్..
ఎదురీదకుండ మునకేస్తావా ....వావ్..వావ్..వావ్..
నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని హో.... ఆ దరికి చేర్చవా
పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే
చీకటిలో నిశి రాతిరిలో నీ నీడ కూడ నిను వదులునులే
నీ వారు అను వారెవరు లేరంటు నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే... చివరంట నీతో నువ్వే...
చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనె లేదనుకో
నీకన్నుల్లొ నీరు తుడిచే చేయి కూడ నీదనుకో ...వావ్..వావ్..వావ్..
లోకాన నమ్మకం లేదసలే ......వావ్..వావ్..వావ్..
దాని పేరు మోసమై మారెనులే .....వావ్..వావ్..వావ్...
వేరెవరి సాయమో ఎందుకులే .వావ్..వావ్..వావ్..... నిను నువ్వు నమ్ముకో
చిత్రం: మిస్టర్ నూకయ్య (2012)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిచరణ్
*************************************
Oke oka jeevitham idi cheyi jaariponeeku
Malli rani e kshanani mannu palu kaaneeku
Kastamanedi leni rojantu ledu kada
Kaneeru dattu kuntu saagipoga tappadugaa
Hoooo amma kadupu odilina adugadugu
Hoooo anandam kosame e parugu
Hoooo kastala batalo kada varaku
Hoooo chirunavvu odalaku
Hooo oooo ohooo ooooo.....
Nuvvevaru nenevaru rasinadevaru mana kathalu
Nuvvu nenu chesinava mana peruna jarige panulu
Edi manchiani adi cheddadani tuukalu veyagalavarevaru
Andhariki chivarakhariki thudi theerpu okkade paivaduuuu
Avthuna mellu keeduuu anubhavalegaa renduuu uuu
Daivam chethi bommalega nuvvu nenu evvarainaa
Talo paatra veeyakunte kaala yatra kadilenaa
woww..woww...wowww....nadi sandram mundu nilichakaa
woww..woww...wowww....edureeda kunda munagesthava
woww..woww...wowww....ninu nammukunna ne prananni
Hoooo....addariki cherchavaa
Ooo.....hooo..hooooo...yeee...heyyyyy eeee yeyeee
Heyyeeee heyyyyy heyy heyi
Puttukatho ne adugu ontariga modalainadilee
Bathukanee margamulo tana todevaru nadavarulee
Chikatilo nisi ratirilo ne needa kuda ninu vadulunulee
Nee varu anu varevaru lerantu nammithe manchidilee
Chithi varaku nethoo nuveeeee
Chivaranta nethooo nuvveee
Chuttu unna lokam antha netho lene ledanukoo
Nekannulo neeru thudiche cheyi kuda needanukoo
woww..woww...wowww......lokana nammakam ledasalee
woww..woww...wowww......dani peru mosamai marenulee
woww..woww...wowww.......verevari sayamo endukulee
woww..woww...wowww.....ninnu nuvvu nammukooo
Hooooo.....oooo....yeyiyaa....yeyiyaa...hooooo
Yeyiya...oooo...mm
Movie Name : Mr.Nokia (2012)
Music Director : Yuvan Shankar Raja
Lyricist : Ramajogayya Sastry
Singers : Haricharan
No comments:
Post a Comment