Wednesday, January 2, 2013

ప్రేమలే నేరమా ప్రియా ప్రియా....వలపు విరహమా ఓ నా ప్రియా..... సఖి (2000)



ప్రేమలే నేరమా ప్రియా ప్రియా.. వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు మమత ఆకాశమా...ఒక తారై మెరిసిన నీవెక్కడో..
కలలై పోయెను నా ప్రేమలు.. అలలై పొంగెను నా కన్నులు (2)
మదికే అతిధిగ రానేలనో సెలవైనా అడగక పోనేలనో
ఎదురుచూపుకు నిదరేది...ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన ఆ మనిషెక్కడో...నా పిలుపే అందని దూరాలలో
కలలై పోయెను నా ప్రేమలు....అలలై పొంగెను నా కన్నులు

అనురాగానికి స్వరమేదీ సాగరఘోషకు పెదవేది (2)
ఎవరికివారే ఎదురుపడి యదలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనీ శిలనైతిని
ఎండమావిలో నావను నే ఈ నిట్టూర్పే నా తెరచాపలే
కలలై పోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు

వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి (2)
చేసిన బాసలు కలలైపోతే  బ్రతుకే మాయగా మిగులుననీ
నీకై వెతికా కౌగిలినై నీడగా మారిన వలపులతో
అలసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలై పోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు (2)


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : స్వర్ణలత
**************************************
Premale nerama priya priyaa valapu virahama o na priya..
Manasu mamata aakasama oka taarai merisina neevekkado..
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Madi ke atidhi ga ranelano selavaina adagaka ponelano
Eduru chupuku nidaredi oogenu usure kannirai
Manasu adigina manishekkado na Pilupe andani dooralalo...
Kalalai poyenu..

Anuraganiki swaramedi saagara ghosha ku pedavedi
Evariki vaare edurupadi yedalu ragulu yedabaatulalo
Chivariki daare melika padi ninu cheraga neno silanaithini
Endamaavi lo navanu le ee nitturpe na terachapale
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu...

Vennela mandina vedana lo kaluva poovu la kalata padi
Chesina basalu kalalipothe brathuke maya ga migulunani
Nikai vethika kowgilinai needa ga marina valapulatho
Alasi unnanu aashalatho nanu odarche ni pilupennado

Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Madi ke atidhi ga ranelano selavaina adagaka ponelano
Eduru chupuku nidaredi oogenu usure kannirai
Manasu adigina manishekkado na Pilupe andani dooralalo...
Kalalai poyenu ...


Movie Name : Sakhi (2000)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : Swarnalatha

No comments:

Post a Comment