Wednesday, February 13, 2013

గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం..వసంతం (2003)














పల్లవి :
గోదారల్లే  పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
కలహంస నడకల్లోన అందాల హైలస్సా
నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం
నిండా నిండిందమ్మా నాలో సంగీతం ||గోదారల్లె||

చరణం 1
గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే
కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే
సంక్రాంతే రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్త గున్నది
రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల
రాగాలెన్నో తీసివమ్మా తియ్యతీయగా ||గోదారల్లే||

చరణం 2
గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే
హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి ఇది ఆనందం చేసే కొంటె అల్లరి
గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం
మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం ||గోదారల్లే||


చిత్రం : వసంతం (2003)
సంగీతం : S.A.రాజ్ కుమార్
రచన : కులశేఖర్
గానం : ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం
********************************
Godaralle ponge naalo santosham
gorintalla pooce naalo aanandam
harivillai virisindamma kallallona aasha
sirimuvvai palikindamma gundellona Swasa
kalahamsa nadakallona andala hailessaa
nede thechchindhamma mallela vaasantham
nindaa nindindhamma naalo sangeetham..


Movie Name : Vasantham (2003)
Music Director : S.A.Raj Kumar
Lyricist : Kula sekhar
Singer : S.P.Bala Subramaniam

No comments:

Post a Comment