Thursday, March 28, 2013

అబ్బాయిలూ చెప్పనా ప్రేమపాఠం ...... ఇద్దరూ ఇద్దరే (1990)


పల్లవి :
అబ్బాయిలూ చెప్పనా ప్రేమపాఠం
అమ్మాయిలూ నేర్పనా కొత్త నాట్యం
జపనిలో జాగ్రఫీలు... జానులలో జామెట్రీలు
కిస్సింగులో కెమిస్ట్రీలు...
రొమాన్సులో రహస్యాలు
తెలిపే వలపే విరిసే వయసిదికదా
॥

చరణం : 1
టాటా చెప్పరా సోదర ప్రతిక్లాసుకి
డ్యూటీ వేయర వీధిలో చెలి వేటకి
వీలుచూసి గాలమేసి ఈలకొట్టు
సందుచూసి సైగచేసి సైటుకొట్టు
ప్రేమభిక్ష వేడుకుంటు జోలకొట్టు
జాలిచూపి చేరమంటు గోలపెట్టు
పరాభవం ఎదురైన పరాజయం అనుకోకు
పరీక్షలే ఫెయిలైనా నిరాశలో పడిపోకు
సరిగా వినరా బ్రదరూ తొలి సిలబసు
॥

చరణం : 2
సాయంకాలం పార్కులే నీ క్లాసురూమ్
బేబీ హాబీ జాబితా నీ పుస్తకం
పాపకెన్ని పరికిణీలో లెక్కపెట్టు
వాళ్ల బొచ్చుకుక్కపిల్ల జట్టుకట్టు
ఆమెగారి ఈసడింపు ఓర్చుకుంటూ
అడ్డమైన చాకిరీలు చేసిపెట్టు
ఇలా ఇలా గడిచాక తపోబలం పెరిగాక
లిఖించిరా లవ్ లేఖ ఫలించురా నీ దాక
బదులే దొరికే వరకూ కథ నడపరా
॥


చిత్రం : ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం : రాజ్-కోటి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : మనో, కె.ఎస్.చిత్ర
****************************************
Movie Name : Iddaru Iddare (1990)
Music Director : Raj-Kori
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : Mano, K.S.Chitra

No comments:

Post a Comment