Thursday, April 25, 2013

ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా.... విచిత్ర జీవితం (1978)














ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా...
ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా...
ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా...
ఈ పేద కలువ నీకు గురుతేనా తెలుపుమా
ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా

చరణం : 1
నీవు నాకు చేసిన బాస.... నీటి మీద రాసిన రాత
నీవు నాకు చేసిన బాస.... నీటి మీద రాసిన రాత
తాళి కట్టిన కలువకన్న తలుకులోలికే తార మిన్న
రోజూ  మారే  రూపం నీది.. రోజూ  మారే  రూపం నీది..
మోజు పడిన పాపం నాది
ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా

కళలు మార్చి కలలే చెరిపి....  మనువు మార్చి  మంటలు రేపి
కళలు మార్చి కలలే చెరిపి....  మనువు మార్చి  మంటలు రేపి
మచ్చ పడిన సొగసు నీది చిచ్చు రేగిన మనసు నీది
కట్టగలవు  మెడకో తాడు...కట్టగలవు  మెడకో తాడు...
కన్నె వలపుకే ఉరితాడు

ఓ చంద్రమా .. ఒకనాటి ప్రియతమా...
ఈ పేద కలువ నీకు గురుతేనా తెలుపుమా
ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా


చిత్రం : విచిత్ర జీవితం (1978)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : పి. సుశీల
*********************************
oo chandramaa...okanaati priyatamaa....
oo chandramaa...okanaati priyatamaa....
oo chandramaa...okanaati priyatamaa....
ee peda kaluva neeku gurutenaa telupumaa
oo chandramaa okanati priyatamaa

neevu naku chesina baasa.... neeti meeda rasina raata
neevu naku chesina baasa.... neeti meeda rasina raata
taali kattina kaluvakanna talukulolike taara minna
roju maare rupam needi..
moju padina paapam naadi
oo chandramaa okanati priyatamaa

kalalu maarchi kalale cheripi.... manuvu maarchi mantalu repi
kalalu maarchi kalale cheripi.... manuvu maarchi mantalu repi
macha padina sogasu needi chichu regina manasu naadi
kattagalavu medako taadu.. kattagalavu medako taadu..
kanne valapuke uri taadu..

oo chandramaa...okanaati priyatamaa....
ee peda kaluva neeku gurutenaa telupumaa
oo chandramaa okanati priyatamaa


Movie Name : Vichithra Jeevitham (1978)
Music Director : Chakravarthy 
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : P.Susheela 

No comments:

Post a Comment