ఒకటే కోరిక నిన్ను చేరాలని
ఒడిలో కమ్మగా కరిగిపోవాలని కరిగిపోవాలని(2)
నడకతో లేత నడుముతో చెలి మంత్రమే వేసెను
కురులలో నీలి కనులలో నా హృదయమే చిక్కెను
నీ చూపులే నను నిలువునా కౌగిలిస్తున్నవి
నా పెదవులే నీ నామము కలవరిస్తున్నవి
కలలందు కనులందు కదలక నిలిచెను నీ సొగసు
చేతికి చేయి తగిలితే గుబులు పుడుతున్నది
కొత్తగా నా వయసుకు దిగులు వేస్తున్నది
చెక్కిట ఆ నొక్కులు ఆశ పెడుతున్నవి
ఆ ఒంపులు మేని బరువులు నను నిలువనీకున్నవి
అణువణువు ప్రతి నిమిషం తొందర చేసెను నీకోసం
ఒడిలో కమ్మగా కరిగిపోవాలని కరిగిపోవాలని(2)
నడకతో లేత నడుముతో చెలి మంత్రమే వేసెను
కురులలో నీలి కనులలో నా హృదయమే చిక్కెను
నీ చూపులే నను నిలువునా కౌగిలిస్తున్నవి
నా పెదవులే నీ నామము కలవరిస్తున్నవి
కలలందు కనులందు కదలక నిలిచెను నీ సొగసు
చేతికి చేయి తగిలితే గుబులు పుడుతున్నది
కొత్తగా నా వయసుకు దిగులు వేస్తున్నది
చెక్కిట ఆ నొక్కులు ఆశ పెడుతున్నవి
ఆ ఒంపులు మేని బరువులు నను నిలువనీకున్నవి
అణువణువు ప్రతి నిమిషం తొందర చేసెను నీకోసం
చిత్రం : అల్లరి బుల్లోడు (1978)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి సుందరరామమూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
***************************************
okate korika ninnu cheraalani
odilo kammagaa karigipovalani karigipovalani(2)
nadakato leta nadumuto cheli mantrame vesenu
kurulalo neeli kanulalo na hrudayame chikkenu
ne chupule nanu niluvunaa kougilistunnavi
na pedavule ne namamu kalavaristunnavi
kalalandu kanulandu kadalaka nilichenu ne sogasu
chetiki cheyi tagilite gubulu pudutunnadi
kottagaa na vayasuku digulu vestunnadi
chekkita aa nokkulu asha pedutunnavi
aa ompulu meni baruvulu nanu niluvaneekunnavi
anuvanuvu prati nimisham tondara chesenu nekosam
Movie Name : Allari Bullodu (1978)
Music Director : Chakravarthy
Lyricist : Veturi SundaraRamamurthy
Singers : SP. Balasubramaniam

No comments:
Post a Comment