
పల్లవి :
ఓహోహో... ఓహో... హో... ఓహోహో... ఓహో... హో...
ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి
॥రేయి॥
చరణం : 1
ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో
ఏ మబ్బు మాటున్నావో ఏ పొదల చాటున్నావో
ఏ గాలి తరగలపైన ఊగి ఊగిపోతున్నావో
ఏ గాలి తరగలపైన ఊగి ఊగిపోతున్నావో
కలగా వన్నే కవ్వించేవో॥రేయి॥
చరణం : 2
చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను
చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను
నీ కంటిపాపలలోన నేను దాగి వున్నాను
నీ కంటిపాపలలోన నేను దాగి వున్నాను
నీలో నేనై... నిలిచున్నాను...
॥రేయి॥
చరణం : 3
ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను
ఆనాటి చూపులన్నీ లోన దాచుకున్నాను
నీవు లేని వెన్నెలలోన నిలువజాలకున్నాను
నీవు లేని వెన్నెలలోన నిలువజాలకున్నాను
కనవే చెలియా... కనిపించేను...
॥రేయి॥
చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి.రాజు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, పి.సుశీల
****************************************
ee reyi nuvvu nenu yelaagaina kalavali
ningiloni taralu rendu nela meeda nilavali
ee reyi nuvvu nenu yelaagaina kalavali
ningiloni taralu rendu nela meeda nilavali
ye mabbu matunnavo ye podala chatunnavo
ye mabbu matunnavo ye podala chatunnavo
ye gali taragala paina teli teli potunnavo
ye gali taragala paina teli teli potunnavo
kalagaa nanne kavvinchevoo..
chandamamalo unnanu challa galilo unnanu
chandamamalo unnanu challa galilo unnanu
ne kanti papalona nenu dagi unnanu
ne kanti papalona nenu dagi unnanu
nelo nenai niluchunnanu
aanaati choopulannee lona dhaachukunnaanu
aanaati choopulannee lona dhaachukunnaanu
neevu leni vennelalona nilavajaalakunnaanu..
neevu leni vennelalona nilavajaalakunnaanu..
kanave cheliyaa.. kanipinchenu..
ee reyi nuvvu nenu yelaagaina kalavali
ningiloni taralu rendu nela meeda nilavali
Movie Name : Pidugu Ramudu (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela
No comments:
Post a Comment