Tuesday, May 14, 2013

రా రా రారా కౌగిలి చేర రారా దొరా.. ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా... పిడుగు రాముడు (1966)














నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా
మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా
మెరుపులున్న చినవాడా
రా రా రారా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా  కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...

చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
మనసందుకో నా మరులందుకో.... మనసందుకో నా మరులందుకో....
ఓ మగరాయడా నీకు బిగువెందుకో
రా రా  కౌగిలి చేర రారా దొరా....ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...

పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
మాటాడవా సయ్యాటాడవా.... మాటాడవా సయ్యాటాడవా....
నీ కొస చూపుతో నన్ను వేటాడవా
రా రా  కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా  కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...


చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : పి. సుశీల
******************************************
Nadakalo kodama singapu adugulunna monagaadaa
menilo pasidi vannela merupulunna chinavaadaa
merupulunna chinavaadaa
raa raa raara kougili chera raaraa doraa
ee rangeli praayammu needenu raa...

chaligaali veecheenu nekosame...ee cheli saiga cheseenu nekosame..
chaligaali veecheenu nekosame...ee cheli saiga cheseenu nekosame..
manasanduko na marulanduko....manasanduko na marulanduko....
oo magaraayadaa neku biguvenduko
raara kougili chera raaraa doraa...ee rangeli praayammu needenu raa...

podarindlu ninu nannu rammannavi....na madiloni raagaalu jhummannavi..
podarindlu ninu nannu rammannavi....na madiloni raagaalu jhummannavi..
maataadavaa sayyaataadavaa...maataadavaa sayyaataadavaa...
ne kosa chuputo nannu vetaadavaa
raara kougili chera raaraa doraa...ee rangeli praayammu needenu raa...
raara kougili chera raaraa doraa...ee rangeli praayammu needenu raa...


Movie Name : Pidugu Ramudu (1966)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singer : P.Susheela

No comments:

Post a Comment