Friday, May 10, 2013

నా హృదయపు కోవెలలో .... నా బంగారు లోగిలిలో .... ఇద్దరు అమ్మాయిలు (1970)

నా హృదయపు కోవెలలో ఆ..ఆ
నా బంగారు లోగిలిలో ఆ ఆ
ఆనందం నిండెనులే అనురాగం పండెనులే
ఆ...హా...
నా హృదయపు కోవెలలో...

ఆహా..ఆ..మధువులు కురిసే గానముతో
మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో
నా మనసును నిలువునా దోచితివే
నా హృదయపు కోవెలలో

అహహ...ఆహాహా...ఆహాహా..ఆ..
శాంతికి నిలయం నీ హృదయం
నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే
నా బ్రతుకున కాపురముందువులే
నా హృదయపు కోవెలలో

ఆహా..ఆ..ఆ...
ఇంటికి నీవే అన్నపూర్ణగా
ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చేపోయే అతిధులతో
మన వాకిలి కళకళలాడునులే


చిత్రం : ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : దాశరధి 
గానం : పి.సుశీల 
*************************************************
na hrudayapu kovelalo aa..aa
na bangaru logililo aa aa
aanandam nindenule anuragam pandenule
aa...haa...
na hrudayapu kovelalo...

aahaa..aa..madhuvulu kurise ganamuto
mamatalu nalo penchitive
sogasunu minchina sugunamuto
na manasunu niluvuna dochitive
na hrudayapu kovelalo

ahaha...aahaha...ahaahaa..aa..
shantiki nilayam ne hrudayam
na premaku alayamainadile
lakshmi saraswati neevele
na bratukuna kapuramunduvule
na hrudayapu kovelalo

aahaa..aa..aa...
intiki neeve annapurnagaa
pratiroju oka pandugagaa
vachepoye atidhulato
mana vakili kalakalaladunule


Movie Name : Iddaru Ammaayilu (1970)
Music Director : K.V.Mahadevan
Lyricist : Dasarathi
Singer :  P.Susheela

No comments:

Post a Comment