చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో....
చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో
పలికెనులే హృదయాలే(2)తొలి వలపుల కలయికలో..
(చిరునవ్వుల)
వసంతాలు దోసిట దూసి విసిరేను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవ నాడిగా(2)
ఎగిసేను గగనాల అంచులలో
విరియునులే ఆ గగనలే నీ వెన్నెల కౌగిలిలో(చిరునవ్వుల)
ఉరికే సెలయేరులన్నీ ఒదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘాలన్నీ ఉలికిపడును నీ పలుకులలో
నీవే నా పుణ్యమూర్తిగా (2)
ధ్యానించు నా మధుర భావనలో
మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో(చిరునవ్వుల)
చిత్రం : చాణక్య చంద్రగుప్త (1977)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : ఎస్. పి.బాల సుబ్రహ్మణ్యం
******************************************
Chirunavvula tolakarilo sirimallela chinukulalo
chirunavvula tolakarilo sirimallela chinukulalo
palikenule hrudayale(2)tholi valapula kalayikalo..(chirunavvula)
vasantalu dosita dusi visirenu ne mungililo
taralane divvelu chesi veligintu ne kannulalo
neve na jeeva nadigaa(2)
yegisenu gaganala anchulalo
viriyunule aa gaganale ne vennela kougililo(chirunavvula)
urike selayerulanni vodigipovu ne nadakalalo
urime meghalanni ulikipadunu ne palukulalo
neve na punyamurtigaa (2)
dhyaninchu na madhura bhavanalo
meriyunule aa bhavanale iru menula allikalo(chirunavvula)
Movie Name : Chanakya Chandraguptha (1977)
Music Director : Pendyala Nageswara Rao
Lyricist : C. Narayana Reddy
Singers : S.P.Balasubramanyam, P. Susheela

No comments:
Post a Comment