Friday, May 3, 2013

ఓ..ఓ..అందమా తెలుగింటీ దీపమా ....... ముత్యమంత ముద్దు (1989)


ఓ..ఓ..అందమాతెలుగింటీ దీపమా
వెలుగింటి రూపమా నేనంటే కోపమా
ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా
నీ అందమే నాకు ఆలాపనా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

చిరునవ్వే చేమంతిగా విరజల్లే హేమంతమా
మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావు
బాలా..శృంగార మాలా
అరవిచ్చే అందాలతో మనసిచ్చే మందారమా
కలలను పరచీ హృదయాన్నే కలవర పరచావూ
భామా..రాశాడే బ్రహ్మా..నీ కోసమే తీపి ఆవేదనా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు
ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా

హరివిల్లు అందాలతో ఎదురొచ్చే ఆకాశమా
తొలకరి జల్లే గుండెల్లో అలజడి పెంచావూ
ప్రేమే నాకున్న ధీమా..
రవివర్మ చిత్రానివో నవ హంపీ శిల్పానివో
మదనుడు వేసే బాణంలా మనసును గిచ్చావూ
గుమ్మా.. ఓ బాపు బొమ్మా..ఈ గీతమే నీకు ఆరాధనా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు


చిత్రం : ముత్యమంత  ముద్దు (1989)
సంగీతం : హంసలేఖ
రచన  : వేటూరి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం
*****************************************
oo...oo andamaa...
teluginti deepamaa veluganti rupamaa
nenante kopamaa(2)
ne andame naku alapana
i love you i love you i love you...

chirunavve chemantigaa
virajalle hemantamaa
munuperugani ye bandhalo
mudupulu ichavu
balaa shrungara maala
araviche andalatoo
manasiche mandaramaa
kalalanu parichi hrudayanni
kalavaraparichavu
bhamaa rasade brahma
nekosame teepi avedana
i love you i love you i love you

harivillu andalatoo yeduroche akashamaa
tolakari jallai gundello
alajadi penchavu preme nakunna dheema
ravivarma chitranivo....navahampi shilpanivo
madhanudu vese banamlaa
manasunu gichavu
gummaa oo bapu bommaa
ee geetame neku aradhana
i love you i love you i love you


Movie Name : Muthyamantha Muddu (1989)
Music Director : Hamsalekha
Lyricist : Veturi
Singer : S.P.Bala Subramaniam

No comments:

Post a Comment