
దంచేటి అమ్మలక్కల్లో ఆ చెమ్మచెక్కల్లో
పడుచుల పకపకలు
నలిగేటి పసుపు కొమ్ముల్లో ఆ నడుము ఒంపుల్లో
సొగసరి కదలికలు
ధిన్న ధీం ధీంతక ధీం ధీంతక ధిన్న
ధిన్న ధీం ధీంతక ధీం ధీంతక ధిన్న
డుండుండుం డుమ్మా డోలు సన్నాయ్
మాంగళ్యం తంతునేనా అన్నాయ్
సీతమ్మకోక చిలకలు జత పడే పలుకులు
తొలి వలపు కులుకులు
హే. సీతమ్మకోక చిలకలు జత పడే పలుకులు
తొలి వలపు కులుకులు
ముద్దొచ్చే మూగ పిలుపులు ఉరుమనే మెరుపులు
ఉడుకుడుకు చినుకలు
ధిన్న ధీం ధీంతక ధీం ధీంతక ధిన్న
ధిన్న ధీం ధీంతక ధీం ధీంతక ధిన్న
డుండుండుం డుమ్మా డోలు సన్నాయ్
మాంగళ్యం తంతునేనా అన్నాయ్
పలుకే బంగారమా ఈ వేళ పడుచు శృంగారమా
అలకే సింగారమా అందాన్ని పరిచే పరువాలమ్మా
వయసు వయసు జత కుదిరె
ఒకటై ఒదిగి శృతి ముదిరె
సీతమ్మకోక చిలకలు జత పడే పలుకులు
తొలి వలపు కులుకులు
అహ ముద్దొచ్చే మూగ పిలుపులు ఉరుమనే మెరుపులు
ఉడుకుడుకు చినుకలు
పసుపు కుంకాలుగా ఈ జంట కలిసిపోవాలంట
చిలక గోరింకలే ఈ జంట చూసి అలగాలంట
పొగలో సెగలో చెమటలకా
తెరలో మెరిసే చెమకలుకా
సీతమ్మకోక చిలకలు జత పడే పలుకులు
తొలి వలపు కులుకులు
హే ముద్దొచ్చే మూగ పిలుపులు ఉరుమనే మెరుపులు
ఉడుకుడుకు చినుకలు
ధిన్న ధీం ధీంతక ధీం ధీంతక ధిన్న
ధిన్న ధీం ధీంతక ధీం ధీంతక ధిన్న
డుండుండుం డుమ్మా డోలు సన్నాయ్
మాంగళ్యం తంతునేనా అన్నాయ్
కొత్త కోడలమ్మ గోరంత దీపం ఓయమ్మ
కోరుకున్నవాడు కొండంత వెలిగెలేవమ్మ
కొత్త కోడలమ్మ గోరంత దీపం ఓయమ్మ
కోరుకున్నవాడు కొండంత వెలిగెలేవమ్మ
చిత్రం : మౌనమేలనోయి (2002)
సంగీతం : రమణ గోగుల
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం :
********************************************
Movie Name : Mounamelanoyi (2002)
Music Director : Ramana Gogula
Lyricist : Veturi sundara Ramamurthy
Singer :
No comments:
Post a Comment