Wednesday, May 1, 2013

ప్రేమే గానమాయె పెదవేమో మౌనమాయె .... మౌనమేలనోయి (2002)


ప్రేమే గానమాయె పెదవేమో మౌనమాయె
కలలేమో కన్నులాయే శిలపైన వెన్నెలాయె
వడగాలి వేణువూదే వయసంతా వెచ్చనాయె
వడగాలి వేణువూదే వలపంతా వేసవాయెనులే
ప్రేమే గానమాయె పెదవేమో మౌనమాయె

నీవులేని చీకటిలోన క్షణమైనా ఉండలేక
రేపులేని రాతిరిలోన కలనైనా నిదురపోక
నేనున్నా నీడలాగ ఇకనైనా తోడు కావా
ప్రేమే గానమాయె పెదవేమో మౌనమాయెనులే

పూతలోనే రాలిపోయే పువ్వులేనా ప్రేమలంటే
మూడు నెలలే పాడిపోయే కోయిలేనా హృదయమంటే
మెరుపేనా మేఘమేనా మరుపేనా మాయమేనా

ప్రేమే గానమాయె పెదవేమో మౌనమాయె
కలలేమో కన్నులాయే శిలపైన వెన్నెలాయె
వడగాలి వేణువూదే వయసంతా వెచ్చనాయె
వడగాలి వేణువూదే వలపంతా వేసవాయెనులే
ప్రేమే గానమాయె పెదవేమో మౌనమాయెనులే


చిత్రం : మౌనమేలనోయి (2002)
సంగీతం : రమణ గోగుల
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం :
********************************************
Movie Name : Mounamelanoyi (2002)
Music Director : Ramana Gogula
Lyricist : Veturi sundara Ramamurthy
Singer :

No comments:

Post a Comment