
వన్నె చిన్నెలన్ని ఉన్న చిన్నదానివే
అన్నీ ఉన్నదానివే
ఎన్ని ఉన్నా తోడు లేక లేనిదానివే
ఏమీ లేనిదానివే ఉత్త ఆడదానివే
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రలున్నా(2)
కళ్ళెం పట్టి(2) కళ్ళను కట్టి నడిపే మొనగాడుండాలి
అందనిదైనా గాని నరులందరు కోరుదురందాన్ని(2)
తూకం వేసి(2) పాకం చూసి డెందం ఒకరికే ఇవ్వాలి
అందం డెందం కలిపి ఆనందం అర్ధం తెలిపే
అతగాడొకడు జత అయినపుడు అన్నీ వున్నవనుకోవాలి...
చిత్రం : వాగ్దానం (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల
***************************************************
vanne chinnelanni unna chinnadanive anni unnadanive
yenni unna todu leka lenidanive yemi lenidanive utta aadadanive
tirige chakraalunna paikegire gurralunnaa(2)
kallem patti(2) kallanu katti nadipe monagadundali
andanidaina gani narulandaru korudurandaanni(2)
tukam vesi(2) pakam chusi dendam okarike ivvali
andam dendam kalipi anandam ardham telipe
atagadokadu jata ayinapudu anni vunnavanukovali...
Movie Name : Vagdanam (1961)
Music Director : Pendyala Nageshwar Rao
Lyricist : Aacharya Aatreya
Singer : Ghantasala
No comments:
Post a Comment