Friday, July 19, 2013

నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే.... పూజ (1975)

పల్లవి :
నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
నింగీ నేలా ఒకటాయెలే...

చరణం : 1
హో హోహోహో...
ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే
నా వెంట నీవుంటే ఎంతో హాయిలే
ఆహాహా లాలాలా... ఆహాహా లాలాలా
హృదయాలు జత జేరి ఊగే వేళలో
దూరాలు భారాలు లేనే లేవులే
నీవే నేను లే ...నేనే నీవు లే
లలలలలా... లాలాల లాలాల...
నింగీ నేలా ఒకటాయెలే

చరణం : 2
రేయైనా పగలైనా నీపై ధ్యానము
పలికింది నాలోన వీణా గానము
ఆహాహా లాలాలా... ఓహోహో లాలాలా
అధరాల కదిలింది నీదే నామము
కనులందు మెదిలింది నీదే రూపము
నీదే రూపమూ ... నీవే రూపము
లలలలలా... లాలాల లాలాల...

నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే...


చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
రచన  :  దాశరథి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, వాణీ జయరాం
*****************************************************
Movie Name : Pooja (1975)
Music Director : Rajan - Nagendra
Lyricist : Dasarathi
Singers : S.P.Balasubramanyam, Vani Jayaram

No comments:

Post a Comment