Wednesday, July 17, 2013

జాబిల్లి ఎండల్లో సరసాలు సరదాలు కసిగా కథలా మొదలాయే ... అగ్ని (1989)

పల్లవి :
జాబిల్లి ఎండల్లో సరసాలు
సరదాలు కసిగా కథలా మొదలాయే
ఈ పూలదండల్లో యమకాలు
చమకాలు తొలిగా చలిగా కథలాయే
తనువుల కదలిక నడుముల
కలయిక ఏమి తాళమో
అదిమెను అడగక బిగువును
వదలక ఎంత తాపమో ॥

చరణం : 1
చిన్నప్పుడు ఈడున్నప్పుడు వేడున్నప్పుడు
రేగే చప్పుడు
ఎక్కడికక్కడ ఎక్కిడి తొక్కిడి సోకులు సిక్కడి ముద్దుల
ముట్టడి సాగినప్పుడు... తొందరే పుట్టినప్పుడు...
ఈ కుప్పెడు నా గుట్టిప్పుడు విడగొట్టిప్పుడు
జతకట్టిప్పుడు
చక్కెర చెక్కిలి చెక్కిన ఎంగిలి అంటిన కౌగిలి
అక్కిటి లోగిలి చేరినప్పుడు... సిగ్గులు జారినప్పుడు...
జాజుల మల్లెల మోజుల వెల్లువ
రోజొక వెన్నెల చిలికిన వలపుల
అలికిడికి తడిసిన తనువుల
సందెల చిందిన చందన కుంకుమ
వందనమన్నది ఇంధనమైనది
ఇద్దరి మోహ లాహిరిలో ॥

చరణం : 2
మాటిచ్చుకో ఎదచోటిచ్చుకో
పొదమాటిచ్చుకో పెదవే పుచ్చుకో
అత్తరు మల్లెల మత్తులలోబడి
ఒత్తరి జీవుడు
హత్తుకుపోయిన రాసలీలలో... ఇప్పుడే బాసచేసుకో...
పూవందుకో చిరునవ్వందుకో
జత నువ్వెందుకో నీకు లవ్వెందుకో
మెత్తని కాముడి జిత్తులలో పడి ఒత్తుకు పోయెడి
ఒంపులలో సుడి తాకి చూడనా
చూడని తళుకు చూడనా...
చుక్కలకందక చిక్కని సందిట చెక్కిలి ఇచ్చట
తెలిసిన వయసుల
మదనముడి బిగిసిన మనసుల సందడి ఊహల
సందుల దూరిన పొందుల వేళకు
విందులు కోరిన తేనెల వానల తాకిడిలో॥


చిత్రం : అగ్ని (1989)
సంగీతం : హంసలేఖ
రచన : వేటూరి సుందరరామమూర్తి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
***********************************
Movie Name : Agni (1989)
Music Director : Hamsalekha
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : S.P.Balu, S.Janaki

No comments:

Post a Comment